ఫ్రీడం ఆయిల్ నుండి స‌రికొత్త వంట‌నూనె

‘మంచి రుచి కలిగిన ఆహారం గుండెకు చేటు చేస్తుంద’నేది నానుడి. కానీ, గుండె ఆరోగ్యం గురించి పట్టించుకునే వారెవbరు? చక్కటి వంటనూనె, చాలా వరకూ సాధారణ ఆహారానికి జీవితాన్ని ప్రసాదించడమే కాదు, మీ గుండె ఆరోగ్యం పై కూడా అతి కీలకమైన ప్రభావం చూపుతుంది. మీ కొలెస్ట్రాల్‌ స్ధాయిలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటుగా మీ జీర్ణక్రియ రేటుపై తీవ్ర ప్రభావాన్ని వంట నూనె చూపుతుంది. ఈ కారణం చేతనే మార్కెట్‌లో లభ్యమవుతున్న అపారమైన వంటనూనెల నుంచి సరైన నూనె ఎంచుకోవడం అత్యంత కీలకాంశం.
రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ (ఆర్‌బీఓ) వినూత్నమైన శాఖాహార నూనె. దీనిలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. వరి పొట్టు నుంచి దీనిని బియ్యం పాలిష్‌ చేస్తున్నప్పుడు ఉత్పత్తి చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అధ్యయనాలు ఈ నూనెలో వినూత్నమైన న్యూట్రాస్యూటికల్స్‌– ఒరైజనాల్‌, టోకోఫెరాల్‌, టోకోట్రైనాల్స్‌ మరియు స్క్వాలీన్‌ ఉండటం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గించే లక్షణాలు ఈ నూనెకు ఉన్నాయని నిర్థారించాయి.