సీఎంను వ్యతిరేకించిన మాజీ ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని మాజీ ఐపీఏస్ ప్రవీణ్‌కుమార్ వ్యతిరేకిస్తున్నారు. ఓట్ల కోసమే దళితులను వాడుకుంటున్నారని మండిపడ్డారు. దళితబంధు పేరుతో దళితులను మోసం చేస్తున్నారని విమర్శించారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో స్వేరోస్ జిల్లా సమావేశానికి ప్రవీణ్ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళిత బంధు పథకం పేరుతో రూ. వెయ్యి కోట్లు ఇస్తానని సీఎం కేసీఆర్ మభ్యపెడుతున్నారు. అవే నిధులను గురుకులాల కోసం కేటాయిస్తే ఎంతో మంది పిల్లలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారు’ అని అన్నారు.
అవే పైసలతో దళిత పిల్లలను అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు పంపించి చదివిస్తే ఇంటికో సత్య నాదెళ్ల, సుందర్‌పిచాయ్ లాంటి గొప్ప వ్యక్తులు తయారవుతారని చెప్పారు. ఓట్ల కోసం దళిత ముఖ్యమంత్రి అని మభ్యపెడతారని, అట్లాంటి వాళ్లను మళ్లీ రానీయొద్దని అన్నారు.