తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్‌ల మధ్య రాహదారులు బంద్
తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడమే ఇందుకు కారణంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వాజేడు వద్దగోదావరి నదిపై ఉన్న వంతెనపై నీటి ప్రవాహం ఉదృతంగా వెళ్తోంది. దీంతో పోలీసులు ఈ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. వంతెనపై ఎవ్వరిని వెళ్లనీయకుండా పోలీసులు గట్టి పహారా కాస్తున్నారు. గోదారి ఉదృతి తగ్గిన తరువాతే ప్రయాణానికి అనుమతి ఇస్తామని అక్కడి అధికారులు తెలిపారు.