ప్రగతి భవన్ వద్ద చిన్నశంకరంపేట వ్యక్తి ఆత్మహత్య యత్నం
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ వద్ద కలకలం రేగింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పట్టణానికి చెందిన మెయినుద్దీన్ (38) ఆత్మహత్య ప్రయత్నం చేశారు. తన గ్రామంలోని 100 గజాల స్థలాన్ని బంధువులు ఆక్రమించారని, తనకు న్యాయం జరగడం లేదని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో తన వెంట తీసుకువచ్చిన పెట్రోల్‌ని ఒంటిపై పోసుకొని నిప్పు పెట్టుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న భధ్రత సిబ్బంది, పోలీసులు గమనించి అతన్ని నిలువరించారు. తన భూమి విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మెయినుద్దీన్.











