తీరిన ట్రాఫిక్ కష్టాలు
- బాలనగర్ ఫ్లైఓవర్ ప్రారంభం
బాలానగర్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. రూ.387 కోట్లతో 1.13 కి.మీ. పొడవుతో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. 6 లైన్లు, 24 మీ. వెడల్పు, 26 పిల్లర్లతో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవ క్యార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభంతో స్థానికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఫ్లైఓవర్ ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కూకట్‌పల్లి-సికింద్రాబాద్ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. త్వరలో రహదారుల విస్తరణ చేపడతామన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మిస్తామని తెలిపారు. ఫతేనగర్ ఫ్లైఓవర్‌ను విస్తరిస్తామని కేటీఆర్ వెల్లడించారు.