ప్ర‌ముఖ హీరో కాలేజీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య క‌ల‌క‌లం

HERO MOHANBABU

ప్ర‌ముఖ హీరో మోహ‌న్‌బాబు కి చెందిన శ్రీ‌విద్యానికేత‌న్ కాలేజీ విద్యార్థిని ఆత్మహ‌త్య చేసుకుంది. కాలేజీకి స‌మీపంలోని ఓ హాస్టల్ భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. వివారాల్లోకి వెళ్తే…. క‌డ‌ప జిల్లాకు చెందిన వాసంతి శ్రీ విద్యానికేత‌న్‌లో పాలిటెక్నిక్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ కావ‌డంతో తీవ్ర‌మ‌నో వేద‌నకు గురైన‌ట్టు తోటి విద్యార్థుల ద్వారా తెలుస్తోంది. కాగా త‌న కూతురిని చూడ‌డానికి వాసంతి తండ్రి రావ‌డంతో భ‌యంతో ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిప‌డిన‌ట్టు స‌మాచారం. కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.