తెలంగాణ‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

TELANGANA OMIKRON

ఓమిక్రాన్ వైర‌స్ తెలంగాణ రాష్ట్రంలో చాప‌కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. యూకేలో అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్నా… భార‌త‌దేశంలో ప్ర‌జ‌లు అల‌స‌త్వం వ‌హిస్తున్నారు. వైర‌స్ ప‌ట్ల స‌రైన అవ‌గాహాన లేక‌పోవ‌డం వ‌ల్ల క‌ఠిన‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ వైర‌స్‌పై పూర్తి స‌మాచారం లేక‌పోవ‌డంతో వైద్యులు కూడా ప్ర‌జ‌లు ఎటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో విపులంగా చెప్ప‌లేక‌పోతున్నారు. దీంతో వైర‌స్ త‌న ప్రాతాపాన్ని చూపుతోంది. తెలంగాణ‌లో తాజాగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరో 4 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరింది. వీటిలో 19 కేసులు నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినట్టు వెల్లడైంది.

రాష్ట్రంలో కొన్నిరోజుల వ్యవధిలోనే కొత్త వేరియంట్ కేసులు రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ కేసుల్లో దేశంలో ఢిల్లీ, మహారాష్ట్ర చెరో 54 కేసులతో ప్రథమ స్థానంలో ఉండగా, తెలంగాణ 24 కేసులతో రెండో స్థానంలో ఉంది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటింది.