వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్
మన రాష్ట్రంలో మూడే మూడు ప్రధాన పంటలుగా ఉన్నాయి వరి ప్రత్తి మొక్కజొన్న
53 లక్షల ఎకరాలలో పత్తి పంట
79 లక్షల ఎకరాలలో వరి సాగు
20 లక్షల ఎకరాలలో మొక్కజొన్న పండించారు.
మిగతా పంటలలో..
నాలుగు లక్షల ఎకరాలలో సోయా..
మూడున్నర లక్షల ఎకరాల్లో కూరగాయలు
లక్షా 25 వేల ఎకరాలలో పసుపు
ఏడు లక్షల ఎకరాలలో కందులు పండించాము.
రెండున్నర లక్షల ఎకరాలలో ఇతర పంటలు వేశారు.
మూడు ప్రధాన పంటలు వేయవద్దు అనేది కాదు… రెండు నెలలుగా మంత్రులు.. నేను… ఇతర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అనేక పరిశోధనలు చూశాం. కొంత అవగాహన కలిగింది.
నియంత్రిత పంటల విధానం అంటే బ్రహ్మ పదార్థం కాదు. ఎక్కడ.. ఏ పంట.. ఎంత విస్తీర్ణంలో.. ఎప్పుడు వేస్తే లాభదాయకంగా ఉంటుందో చెప్పేది ఈ విధానం..
మన శాస్త్రజ్ఞులు మంచి దిగుబడి వచ్చే.. మంచి రాబడి వచ్చే పంటలను సూచిస్తారు.
మనం గత ఏడాది 79 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశాం.
రాబోయే రోజుల్లో ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. కోటిన్నర ఎకరాల ఎకరాలకు సాగునీరు అందుతుంది..
పూర్తిగా వరి పంట వేస్తే.. నాలుగున్నర కోట్ల టన్నుల వరి దిగుబడి వస్తుంది.
అంత పెద్ద మొత్తంలో వరి వస్తే.. తట్టుకునే శక్తి.. బియ్యం తయారు చేయగల శక్తి మన దగ్గర ఉన్న రైస్ మిల్లర్లకు లేదు.
మన మిల్లర్లు కోటి 75 లక్షల టన్నుల వరి మాత్రమే మిల్లింగ్ చేస్తారు.
కనుక పంటలు వేసే ముందు లాభసాటి అనే అంశాన్ని తీసుకోవాలి.
ఈ సంవత్సరం కరోనా వల్ల వరి ధాన్యాన్ని కొన్నాము.. కానీ పంటలు కొనడం ప్రభుత్వ విధానం కాదు..
ఇప్పుడు రైతులంతా విడిపోయి ఉన్నారు. కానీ సంఘటితం అయితే దేనినైనా సాధించగలం.
రాబోయే 15 రోజులలో ప్రతి జిల్లా అధికారులు వ్యవసాయ సంబంధిత పనులు మాత్రమే చేస్తారు.
మన రాష్ట్రంలో ఎకరా పత్తి వేస్తే దాదాపు 50 వేల రూపాయల లాభం వస్తుంది. అదేవిధంగా ఒక ఎకరాలో వరి పంట వేస్తే 25 వేల రూపాయల గరిష్టంగా మిగులుతుంది.
కనుక పత్తి పంటలో అధిక లాభాలను గడించవచ్చు..
గత ఏడాది 53 లక్షల ఎకరాలలో పత్తి పంట వేశాం.. ఈసారి 70 లక్షల ఎకరాల దాకా పత్తి సాగు చేయాలి..
40 లక్షల ఎకరాలలో వరి సాగు చేయవచ్చు.. ఇందులో దొడ్డు రకాలు.. సన్న రకాల ధాన్యం గురించి అధికారులు నిర్ణయిస్తారు.
12 లక్షల ఎకరాలలో కంది పంట సాగు చేద్దాం.. కందులను రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది.
ఈ వర్షాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దు మొక్కజొన్న సాగు చేస్తే రైతుబంధు వర్తించదు
కావాలంటే యాసంగిలో మొక్కజొన్న వేయండి.
బీహార్.. చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో మొక్కజొన్న వెయ్యి రూపాయలకు క్వింటాలు అమ్ముతున్నారు. మనకు 1700 రూపాయలు రావాలంటే ఎవ్వరు ఇవ్వరు. కనుక రైతులు ఈ వాన కాలంలో మొక్కజొన్న వేయకండి.
ఎనిమిది నుంచి పది లక్షల ఎకరాలలో మిర్చి.. కూరగాయలు.. సోయా.. పప్పు ధాన్యాలు ఇతర పంటలు వేయండి.
మన రాష్ట్ర పంటలు అత్యుత్తమ నాణ్యత కలిగి ఉండాలి.
దేశంలో బియ్యం గాని.. కందిపప్పు కానీ మన రాష్ట్రంలో పండించిన వాటికి ఎక్కువ డిమాండ్ ఉండాలి.
బియ్యపు గింజ కనీసం 6.5 మిల్లీమీటర్లు సైజులో రావాలి. దానికి ఎక్కువ డిమాండ్.
విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ కొనకండి.
పత్తి కి కావలసిన విత్తనాలు మంచి కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.
వరి విత్తనాలను
సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
ద్వారా ఇస్తారు.
రాబోయే ఆరు నెలలలో ప్రతి క్లస్టర్ లోను రైతు వేదిక నిర్మించాలి.
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా నిలబడుతుంది.
త్వరలో
తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్
లను ఏర్పాటు చేస్తాం.
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ నిర్మితం అవుతాయి.
రాష్ట్రంలో ఎక్కడ కూడా వ్యవసాయ విస్తరణ అధికారి పోస్టులు ఖాళీగా ఉండకూడదు.
జిల్లా కలెక్టర్లు తాత్కాలికంగా aeo పోస్టులను నింపాలి.
జిల్లా ఆధారంగా రైతుబంధు పథకం డబ్బులు… నియంత్రిత వ్యవసాయ పద్ధతిలో ఎక్కువ మేర తీసుకునేందుకు కలెక్టర్లు పోటీ పడాలి.
వ్యవసాయ శాఖలో మరో రెండు అనుబంధ విభాగాలు త్వరలో అమలులోకి వస్తాయి.
మొదటిది రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్
రెండవది మార్కెటింగ్ వింగ్.
ప్రతి మండలంలోనూ పంటలు సాగు చేసేందుకు ఉండే యాంత్రిక శక్తి ఎంత అనే లెక్క మండల వ్యవసాయ అధికారితో ఉండాలి.
రాబోయే రోజుల్లో యాంత్రిక సాయం పైనే వ్యవసాయం ఆధారపడుతుంది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తుంది.