వారికీ ఏ లోటు రాకుండా చూస్తాం : జనార్దన్ రెడ్డి

లాక్ డౌన్ వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అని తెలంగాణ జన సమితి మెదక్ నియోజకవర్గ ఇంఛార్జి జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చి వలస కూలీలను  చావమన్నట్టు గాలికి వదిలేసారు అన్ఱి విమర్శించారు. అయినా కానీ వలస కూలీలకు, ప్రయాణికులకు అల్పాహారం, భోజన వస్తులు ఏర్పాటు చేస్తున్నట్లు అయన తెలిపారు. నిత్యం 44 జాతీయ రహదారి మీద వేలాది మంది కూలీలు ఇతర రాష్ట్రాలకు కాలినడకన తరలి వెళ్తున్నారు అని పేర్కొన్నారు. అయితే మెదక్ జిల్లాలో ప్రయాణించేవారికి తెలంగాణ జన సమితి వారికీ అనేక రకాలుగా సేవలు అందిస్తున్నామని తెలిపారు.