పర్యటాక కేంద్రంగా ఉత్తరాఖాండ్
శీతాకాలపు పర్యాటకు కేంద్రంగా, మంచు క్రీడలకు వేదికగా మారుతోంది ఉత్తరాఖాండ్. విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న మంచు క్రీడలకు ఇప్పుడు భారతదేశం కూడా చేరింది. ఇప్పటికే దేశంలోని కొన్ని మంచు ప్రదేశాల్లో అందుబాటులో క్రీడలు ఇప్పుడు ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో మరింత ముందకు వెళ్తోంది. స్కీయింగ్ విషయానికొస్తే అతి విశాలమైన, సుందరమైన ప్రదేశంలో ఈ క్రీడ అనువుగా ఉంది. దేశ వ్యాప్తంగానే కాకుండ ప్రపంచంలో వివిధ దేశాల నుండి పర్యటకుల సంఖ్య పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలు మెరుగుపరిచి పర్యటకులను ఆకర్షించేలా ప్లాన్ చేస్తోంది.