కామినేని ఆస్ప‌త్రిలో చేరిన దీపికా ప‌దుకొణె

దీపికా పదుకొణె మంగళవారం హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో చేరారు. డస్కీ బ్యూటీ దీపికా పదుకొణె ప్రముఖ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొణె కుమార్తెగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తన డైలాగ్ డెలివరీ మరియు ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దీపికా పదుకొణె ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇంతలో దీపికా పదుకొణె గుండెచప్పుడు పెరగడంతో కామినేని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన దీపికా పదుకొణె ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు షారుక్ ఖాన్‌తో దీపికా ‘పఠాన్’ చేస్తోందని, ఆమె ఓ హాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.