ఇంటి ఓనర్ కిరాయి అడిగితే 100 కి ఫోన్ చేయండి.

లాక్ డౌన్ సమయంలో ఇంటి ఓనర్లు అద్దె కట్టమని ఇబ్బంది పెడితే 100 కి ఫోన్ చేయమని తెలంగాణ సీఎం కెసిఆర్ తెలిపారు. మూడు నెలల పాటు అద్దె అడగవద్దు అని ఎవరైనా ఒత్తిడి తెస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే స్కూల్ ఫీజులు పెంచవద్దు రాదని, గత ఫీజులు కూడా వాసులు చేయవద్దు అని చెప్పారు. ట్యూషన్ ఫీజు మాత్రమే వాసులు చేయాలనీ చెప్పారు. సీఎం క్యాంపు ఆఫీస్ కేబినెట్ భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. గత నెల మాదిరిగానే వేతనాలు మే నెలలో వస్తాయని చెప్పారు.