ఆస్తులు కాపాడుకోవడానికి ఈటల పార్టీ మారాడు : బాల్క సుమన్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన అస్థులు కాపాడుకోవడానికి మాత్రమే పార్టీ మారారని మండిపడ్డారు తెరాస ఎమ్మెల్యే బాల్కసుమన్. హుజురాబాద్ ఎప్పుడూ గులాబీ కోటనే కానీ కాషాయ కోటగా మారదని అన్నారు. కేసీఆర్ సీఎం అయిన తరువాతనే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందినది పేర్కొన్నారు. అంతే కానీ ఈటలతో ఒరిగింది ఏం లేదన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసి సీఎం కేసీఆర్‌కి కానుకగా ఇస్తామని అన్నారు.