సైకిల్ దిగి కారు ఎక్కనున్న రమణ
తెలంగాణ తెలుగుదేశం పార్టీ భారీ షాక్ తగిలింది. ఇప్పటికే తెలంగాణలో పట్టు కోల్పోయిన పార్టీకి… పార్టీ అధ్యక్షుడే షాక్ ఇచ్చారు. సైకిల్ దిగి కారు ఎక్కడానికి సిద్దమయ్యారు. ఇప్పటికే తెరాస నుంచి రమణకు ఆహ్వానం అందిందని సమాచారం. అయితే పార్టీకి ఎప్పుడు రాజీనామా చేసి కారులో షీకారు చేస్తారు అనేది తరువాయి. కాగా పార్టీ మారినందుకు ఎల్. రమణకు ఎమ్మెల్సీ పట్టం కట్టబెడుతామని హామీ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే పట్టుకోల్పోయిన పార్టీకీ ఏకంగా పార్టీ అధ్యక్షుడే రాజీనామ చేయడం భారీ లోటు అని చెప్పుకోవచ్చు.