తడిసిన దాన్యనాన్ని వెంటనే కొనాలి : గాడిపల్లి అరుణ

సిద్దిపేట జిల్లా బురుగుపల్లి గ్రామంలో ఐకెపి సెంటర్లు లను సందర్శించి వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి బిజేపి మహిళా మోర్చా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అలసత్వం వహించన అధికారులను మందలించడం జరిగింది అదేవిధంగా అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మరియు మొలకెత్తిన ధాన్యము ఒక బస్తా కు 5 కిలోల తరుగు తీసి రైతులను మోసం చేస్తున్న ఐకెపి సిబ్బందిని మందలించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది రైతులకు ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన దాన్యం కొనుగోల వేగం పెంచాలని అధికారులను కోరడం జరిగింది అదేవిధంగా రైతుబంధును వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని మరియు రైతు రుణమాఫీనీ వెంటనే అమలు చేయాలని కోరడం జరిగింది రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతుంటే కేసీఆర్ మాత్రం మా ప్రభుత్వం రైతు పక్షపాతి అని గొప్పలు చెప్పుకోవడం మానీ వెంటనే రైతులకు చేసిన వాగ్దానాలు అన్నిటిని అమలు చేయాలని అదేవిధంగా ఐకెపి సెంటర్లో ఐకెపి సిబ్బంది మరియు కొంతమంది అధికారులు రైతులను మోసం చేసి లాభం పొందాలని అదేవిధంగా రైతులను నానా ఇబ్బంది పేడుతున్న సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పడం జరిగింది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి ఐరెనీ బలమని.సకినల రాణి తదితరులు పాల్గొన్నారు