తెలంగాణ‌లో 18 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సిన్‌

క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పని ప్రదేశాల్లో 18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రైవేట్‌ ఆస్పత్రులకూ అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్‌ కోసం ప్రైవేట్‌ సంస్థలు ప్రైవేట్‌ ఆస్పత్రులతో కోఆర్డినేట్‌ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఇకపై వ్యాక్సిన్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.