డేరా బాబాకు పేరోల్ మంజూరు

దేశంలో సంచ‌ల‌నం సృష్టించిన స‌చ్ఛ సౌధ్ చీఫ్ డేరా బాబా (గుర్మీత్ రామ్ ర‌హీం సింగ్‌) ఎట్ట‌కేల‌కు పేరోలు మంజూరు చేశారు జైలు అధికారులు. త‌న త‌ల్లికి అస్వ‌స్థ‌తగా ఉంద‌ని త‌న‌ని క‌లిసేందుకు డేరా బాబా ఈ నెల 17న ధ‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న అధికారులు 21 రోజుల పాటు పేరోలు మంజూరు చేశారు. దీంతో ఆయ‌న రోహ్‌త‌క్‌లోని సున‌రియా జైలు నుంచి విడుద‌ల‌య్యారు. కాగా అత‌న్ని క‌లిసేందుకు త‌న శిష్యులు పెద్ద ఎత్తున్న వ‌చ్చే అవ‌కాశం ఉండ‌డంతో డేరా ఎక్క‌డ నుండి ఎలా వెళ్లారు, ఏ చోటు వెళ్లారు స‌మ‌చారాన్ని గోప్యంగా ఉంచారు. మ‌రోవైపు అత‌ని భారీ భ‌ద్రత ఏర్పాటు చేశారు. తిరిగి 21 రోజులు త‌ర్వాత మ‌ళ్లీ జైలుకు చేరుకోనున్నారు.