గిద్దలూరు అభివృద్ధే ముఖ్యం : అన్నా రాంబాబు
గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన ముఖ్య లక్ష్యమని అన్నారు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో సరదాగా విలేకరులతో ఆయన చిట్ చాట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎవరూ ఊహించని విధంగా బడ్జెట్ ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెంబర్ వన్‌గా గిద్దలూరుని నిలపడమే తన ధ్యేయమన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డికి కూడా తెలిపినట్లు, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.