ఇలియానా చేసే సైడ్ బిజినెస్ ఇదే

గోవా బ్యూటీ ఇలియానా అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. అయితే అండ్రూతో ప్రేమ‌లో ప‌డిన త‌ర్వాత త‌న కేరీర్‌ని నిల‌బెట్టిన తెలుగు, బాలీవుడ్ సినిమాల‌ను కూడా ప‌క్క‌న పెట్టింది. అండ్రూతో క‌లిసిన‌ప్పుడు అన్ని వదిలేసిన ఇలియానా ఇప్పుడు భవిష్య‌త్ పై బెంగ పెట్టుకుంది. అందుకే ఓ సైడ్ బిజినెస్ మొద‌లుపెట్టింది. ఇలియానా ఈ బిజినెస్ చేస్తుందా అని అంద‌రూ ముక్కున వేలుసుకుంటున్నారు. అస‌లు ఇలియానా మొదులు పెట్టిన బిజినెస్ గురించి తెలియాలంటే ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే మీరు.

తాను తయారుచేసిన చాక్లొట్ కేక్ వీడియోని ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. సూపర్ టేస్టీ అంటూ సందడి చేస్తూ.. తన కెరీర్ మలుపు తిరగబోతోందనే చిన్న హింట్ కూడా ఇచ్చేసింది ఇలియానా. ఇది నాకు ఆల్టర్నేట్ కెరీర్ అవుతుందని భావిస్తున్నానంటూ ఓ ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేసింది.

లాక్ డౌన్ తర్వాత చైన్ రెస్టారెంట్లు, బేకరీలు మొదలు పెట్టే ఆలోచనలో ఇలియానా ఉన్నట్టు తెలుస్తోంది. తన పేరుతోటే వీటిని మార్కెట్ చేసుకోవాలని చూస్తోంది. లవ్ లైఫ్ ఫెయిలైన తర్వాత చాన్నాళ్లు డిప్రెషన్ లోకి వెళ్లింది ఇలియానా. ఇన్ స్టా లో తన లవర్ ఆండ్రూ నీబోన్ ఫొటోలన్నీ డిలీట్ చేసింది. లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేసే సమయంలో సినిమా లైఫ్ ని కూడా పక్కనపెట్టిన ఇలియానా.. ఇప్పుడు కొత్త తరంతో పోటీ పడలేకపోతోంది. ఇటు ఆమెకు లైఫ్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీని కూడా కాదనుకోవడం ఇలియానా చేసిన పెద్ద తప్పు. టాలీవుడ్ లో ఉండి ఉంటే, కనీసం సీనియర్ హీరోలతో అయినా రిపీటెడ్ గా సినిమా అవకాశాలు వచ్చేవి. ఇప్పుడెలాగూ సమయం మించి పోయింది కాబట్టి.. తీరిగ్గా సైడ్ బిజినెస్ గురించి ఆలోచించి బేకరీ ప్లాన్ వేసింది ఇల్లీ బేబీ.

ఇలియానాకు ఇప్పటికే డిజైనరీ గార్మెంట్స్ బొటిక్ ఉంది. ముంబయి, హైదరాబాద్ లో దానికి బ్రాంచీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో కొత్త బిజనెస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఇలియానా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.