సిద్దిపేట దొర‌ల పాల‌న‌లో మెద‌క్‌కి అన్యాయం

సిద్దిపేట దొర‌ల పాల‌నలో మెద‌క్ జిల్లా అన్యాయం అవుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మెద‌క్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, పీసీసీ ఆర్గ‌నైజింగ్ కార్య‌ద‌ర్శి మాడ్యం బాల‌కృష్ణ‌. గ‌తంలో మెద‌క్ నుండి గెలుపొంది ఇప్పుడు విస్మ‌రించ‌డం స‌రికాద‌న్నారు. ఉమ్మ‌డి జిల్లా నుండి విడిపోయిన సిద్ధిపేట‌కే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. వైద్య క‌ళాశాల విష‌యంలో మెద‌క్ జిల్లాకు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌న్నారు. సీఎంగా కేసీఆర్ త‌ల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన‌ట్లు చేస్తున్నార‌ని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఏదో సినిమా చూసిన‌ట్లు చూస్తున్నార‌ని, ఆ దొర‌ల బానిస‌గా మారార‌ని విమ‌ర్శించారు. మెద‌క్‌కి వైద్య క‌ళాశాల వ‌చ్చే వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ త‌రుపున పోరాడుతామ‌ని తెలిపారు.