నటి హేమా కూతుర్ని పెళ్లి చేసుకున్న పూరీ
అవును మీరు చదివిన శీర్షిక అక్షరాల వాస్తవమే. చాలా సినిమాల్లో అక్క, వదినా, తోడి కోడలుగా అలరించి అందరిని ఆకట్టుకున్న నటి హేమా సాక్షాత్తూ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాళ్లు కడిగి కన్యాదానం చేసింది. ఈ విషయాన్ని ఇటీవల ఓ టీవీ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వూలో తన స్వయంగా వెల్లడించింది. అంతే కాకుండా పూరీ అప్పుడు తన మొగుడి చాటుకి దాచుకున్న డబ్బులు కూడా ఇచ్చేదంటా. ఇందులో నిజం ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.
సినిమాల్లోకి అప్పడప్పుడే వస్తున్న పూరీకి నటి హేమాకి సెట్లో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం కూడా పెనవేసుకుంది. అప్పుడే కుదుటపుడుతున్న పూరీకి డబ్బులు అవసరం ఉన్నప్పుడు హేమ భర్తకు తెలియకుండా దాచుకున్న వందల రూపాయాలను పూరీకి అప్పుగా ఇచ్చేదంటా. పూరీ దగ్గర ఉన్నప్పుడు ఆ డబ్బులను హేమాకు కూడా ఇచ్చేవారంట. అయితే ఈ సమయంలోనే పూరీ ప్రేమించన అమ్మాయి లావణ్యను పెళ్లి చేసుకోవడానికి కూడా సాయం చేసింది కూడా హేమానేనట. ఈ ప్రేమ పెళ్లికి నటి హేమా దంపతులే పెళ్లి పెద్దలుగా మారీ పూరీ కాళ్లు కడిగి కన్యాదానం చేసిందంట. పూరీకి నేనే అత్తను అవుతా… మంచి స్నేహితురాలిని అవుతానని చెప్పుకొచ్చింది.