ఘ‌ట్‌కేస‌ర్ మైస‌మ్మ గుట్ట భూములు వివాదంలో తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు

ఘ‌ట్‌కేస‌ర్ ప‌ట్ట‌ణంలో పేరుగాంచిన మైస‌మ్మ గుట్ట భూముల వ్య‌వ‌హారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ దేవాల‌య గుట్ట భూముల‌ను మంత్రి మ‌ల్లారెడ్డి క‌బ్జా చేశార‌ని ఆరోపిస్తూ తీన్మార్ మ‌ల్ల‌న్న అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని తెరాస నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ భూ వివాదాల‌కు మంత్రి మ‌ల్లారెడ్డికి ఎటువంటి సంబంధం లేద‌ని స్థానిక నేత‌లు చెబుతున్నారు. ఈ మేర‌కు మ‌ల్లారెడ్డిపై అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని ఘ‌ట్‌కేస‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై పోలీసుల‌కు ఫిర్యాధు చేశారు. నిజా నిజాలు విచారించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు.