కరోనాతో ఘట్కేసర్ యువకుడి మృతి
నరేష్ ముదిరాజ్, ఘట్కేసర్:
కరోనా కాటు ఘటకేసర్ పట్టణానికి చెందిన యువకుడు మృతి చెందాడు. ఘట్కేసర్ పట్ణణంలోని కొండాపూర్కి చెందిన ఆగిరెడ్డి (33) అనే యువకుడికి ఇటీవల కరోన వైరస్ సోకింది. ఈసీఎల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించిన తర్వాత పరిస్థితి సరిగాలేకపోవడంతో గచ్చభౌలిలోని టిమ్స్ ఆసుప్రతికి తరలించారు. అక్కడ వెంటిలేటర్ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో అక్కడి వైద్యులు రక్షించలేకపోయారు. దీంతో కొండాపూర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందరిని ఎప్పుడూ నవ్వుతూ పలకరించే యువకుడు ఆకస్మాతుగా మరిణించడంతో కన్నీటి పర్యాంతమయ్యారు. అతని భార్యని, కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కాలేకపోయింది. మృతుడికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు.