ఘట్కేసర్ లో స్వచ్చంద లాక్ డౌన్
రిపోర్టర్ నరేష్ ముదిరాజ్, ఘట్కేసర్
ఘాట్కేసర్ మున్సిపాలిటీ పరిధి లో ఈ నెల 10 వ తేదీ నుంచి 23 వరకు స్వచ్చంద లాక్ డౌన్ విధిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ తెలిపారు . మున్సిపల్ కార్యాలయంలో వ్యాపార సంఘాల నాయకులతో నిర్వహించిన అత్యవసర సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు . ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంట వరకు మాత్రమే షాపులు తెరిచి ఆ తరువాత లాక్ డౌన్ పాటించనున్నారు, ఈ మేరకు పట్టణం లో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన లాక్ డౌన్ కు పోలీస్ శాఖ వారు కూడా తమ వంతు బాధ్యత గా రెండు వారాల పాటు పెట్రోలింగ్ నిర్వహించి షాపులు సమయానికి మూసివేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. హాస్పిటల్స్ మరియు మెడికల్ షాపు లు తెరిచి ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి గారు, కౌన్సిలర్ లు కో ఆప్షన్ సభ్యులు మరియు వ్యాపారస్తులు పాల్గొన్నారు.