క‌రోనాను జ‌యించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప్ర‌ముఖ సిని న‌టుడు ప‌వన్ క‌ళ్యాణ్ క‌రోనా వ్యాధి జ‌యించాడు. గ‌త కొన్ని రోజుల క్రితం క‌రోనా సోక‌డంతో పూర్తిగా ఫాం హౌస్‌కే ప‌రిమిత‌య్యారు. డాక్ట‌ర్ల స‌ల‌హాలు-సూచ‌న‌లు పాటించారు. వైద్య సేవ‌లు అందుకున్న ఆయ‌న ఇప్పుడు తిరిగి పూర్తిగా కోలుకున్నారు. మూడు రోజుల కింద మ‌రోసారి ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా నెగిటివ్‌గా తేలింది. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ త‌న కోసం ప్రార్థించ‌వారంద‌రికి ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. అభిమానులు ఆశ్సీసుల‌తోనే కోలుకున్నాన‌ని అన్నారు. ఇలాంటి మ‌ద్దుతు భ‌విష్య‌త్తులో కూడా కావాల‌ని కోరారు. క‌రోనా వ్యాధి సోకిన వారు ఎటువంటి భ‌యంబాంత్రుల‌కు గురి కావ‌ద్ద‌ని, ధైర్యంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు.