కస్టమర్లకు ఆర్‌బిఎల్ ఉద్యోగి శర్మ వేధింపులు
క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టాలని ఆర్‌బిఎల్ ఉద్యోగులకు కస్టమర్లను వేధింపులకు గురిచేస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ బ్లాక్‌మెయిల్‌కి పాల్పడుతున్నారు. ఇక్కడ రాయలేని భాషలో కస్టమర్లను తిడుతున్నారు. కరోనా వల్ల ఉద్యోగాలు పోయి ఓ వైపు బాధపడుతుంటే… మరో వైపు క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టుమని వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో కస్టమర్లు మానసిక అవేదన చెంది ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్తున్నారు. గతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నప్పుడు హైదరబాద్, సైబరాబాద్ పోలీస్ బాస్‌లు కల్పించుకొని ఈ సమయంలో వేధింపులు చేయవద్దని సూచించారు. తీరు మారని బ్యాంకు వాళ్లు పదే పదే ఫోన్లు చేసి భయబాంత్రులకు గురి చేస్తున్నారు. శర్మ ఫోన్ చేస్తున్న నెంబర్ 94949 40931 ఈ నెంబర్ నుండి ఫోన్ చేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పోలీసులు స్పందించి ఇతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.