ప్రత్యేక రంజాన్‌ ఇఫ్తార్‌ టేక్‌ ఎవే మెనూ

పవిత్రమైన రంజాన్‌ మాస స్ఫూర్తిని వేడుక చేయడంతో పాటుగా ఉపవాసంలో ఉన్న అతిథులకు సౌకర్యం అందించేందుకు నోవొటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ప్రత్యేకమైన ఇఫ్తార్‌ టేక్‌ ఎవే మెనూను పరిచయం చేసింది.  కలినరీ డైరెక్టర్‌, చెఫ్‌ కైలాష్‌ గుండుపల్లి మరియు అతని బృందపు చెఫ్‌లు నోవొటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద ఈ ప్రత్యేకమైన, రుచికరమైన మెనూ తీర్చిదిద్దారు. ఈ మెనూ అతిథులకు, వినియోగదారులకు తమ ఉపవాసాన్ని ముగించేందుకు తగిన రీతిలో సంపూర్ణమైన విందును అందిస్తుంది. ఈ డిషెస్‌ను ఆధీకృత పదార్థాలను వినియోగించి తయారుచేశారు మరియు ఈ రుచులు వినియోగదారులకు ఇంటి వంట అనుభూతులనూ అందించనున్నాయి.
ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ ఇఫ్తార్‌ మెనూకు ఆర్డర్‌ చేసేందుకు 9642326162 నెంబర్‌కు కాల్‌ చేయవచ్చు. తద్వారా రంజాన్‌ పండుగ వరకూ రాత్రి 8 గంటల వరకూ టేక్‌ ఎవేలు తీసుకువెళ్లవచ్చు. ఈ టేక్‌ ఎవేలో సంప్రదాయ ఆహార అవకాశాలు అయినటువంటి మటన్‌ హలీమ్‌, ఘోస్‌ కీ షమ్మీ కబాబ్‌, రైతా మరియు సలన్‌తో హైదరాబాదీ ముర్గ్‌ బిర్యానీ , వార్కీ పరాటా, షీర్‌ ఖుర్మా, కట్‌ ఫ్రూట్స్‌, ఖర్జూర, బాదములు మరియు విభిన్నమైన డ్రై ఫ్రూట్స్‌, మరెన్నో ఉన్నాయి. ఈ మెనూ 1099 రూపాయలతో ఆరంభ మవుతుంది. (పన్నులు అదనం)