ఈటెల దాన కంపెనికి ముందే నోటీసులు ఇచ్చిన అధికారులు
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అచ్చంపేట అడివిలో కడుతున్న దాన కంపెనీకి ముందే నోటీసులు ఇచ్చారు స్థానిక అధికారులు. అయితే ఆ నోటీసులు పట్టించుకోకుండా అధికారం అడ్డు పెట్టుకొని ఇంకా నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పెను సంచాలనానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే హాకింపేట గ్రామ పరిధిలో కడుతున్న దాన కంపెనీ భూమి సీలింగ్ ల్యాండ్. ఆ భూమి అగ్రికల్చర్ ల్యాండ్ నుండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా మార్చి గ్రామ పంచాయతీ నుండి అనుమతి తీసుకోవాలి. అయితే ఇక్కడ అటువంటి పనులు చేయకుండా అధికార దాహంతో వారు పట్టుచుకోలేదు. గ్రామంలో ఒక చిన్న ఇల్లు కట్టినా అనుమతి తీసుకోకపోతే నానా యాగీ చేసే అధికారులు నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ క్రమంలో హాకింపేట గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులను అక్కడి ఉద్యోగులకు ఇచ్చినా పట్టించుకోలేదు. దీనితో ఆ నోటీసులను అక్కడ గోడకి అతికించారు.