బిసి ముసుగులో ఉన్న దొర ఈటెల : మంత్రులు
మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌పై ప్రస్తుత తెలంగాణ మంత్రులు మీడియా వేదికగా మండిపడ్డారు. పార్టీలో చేరినప్పటి నుండి రాజేందర్‌కి సముచిత స్థానం ఇచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే మీ అభివృద్ధికి నాంది. మీరు ఆనాడు వాడుకొని ఈనాడు కాదంటే ఎలా ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తారు అన్నారు. పార్టలో గౌరవం ఇచ్చారు కాబట్టే మంత్రిగా ఉన్నావని అన్నారు. మేకవన్నిన పులిగా ఉన్నారుని మరో మంత్రి గంగుల కమలాకర్ అన్నారు . అసెంబ్లీలో ఏనాడు కూడా బిసి గురించి మాట్లాడడని ఆయన ఈవాళ బిసి అని బయటకు ఎలా వస్తారన్నారు. హైదరాబాద్ బయట బిసి, హైదరాబాద్ రాగానే ఓసీ అని అన్నారు. చీమల పెట్టిన పుట్టలో పాములా దూరారని అగ్రహాం వ్యక్తం చేశారు.