బంజారాహిల్స్ లోని స్పాలపై పోలీసుల దాడులు
హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న స్పా యజమానులపై ఇప్పటికే పెటీ కేసులు నమోదు చేసి హెచ్చరించారు. నిన్న స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లో సురేష్ నిర్వహిస్తున్న స్పా సెంటర్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ స్పా లో కండోమ్స్ పోలీసులకు దొరకడంతో నిర్వాహకుడు సురేష్ తో పాటు ఇద్దరు మహిళా తెరపిస్టులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. సురేష్ పై బంజారాహిల్స్ పోలీసులు పెటా కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఇద్దరు అమ్మాయిలపై కేసు నమోదు చేసి రెస్క్యూ హోమ్ కి తరలించారు…