జయసారధికే పట్టంకడుతామంటున్న పట్టభద్రులు
నిరుద్యోగుల కోసం అండగా ఉంటానని అన్నారు వరంగల్, ఖమ్మం, నల్లొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధి రెడ్డి. గత పాలకులు దోచుకున్నారో తప్పా… యువతకు చేసింది ఏం లేదని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువతను బలి చేశారని అన్నారు.
మూడు జిల్లాల వ్యాప్తంగా యువత కూడా జయసారధినే గెలిపించుకుంటామని శపధం చేశారు. గతంలో పల్లాను గెలిపిస్తే… పత్తా లేకుండా పోయారు అని విమర్శించారు. ఆయన సొంత కుంపటిని నిలబెట్టుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు తప్పా… నిరుద్యోగులను పట్టించేకోలేదని యువత మండిపడుతున్నారు. ఈసారి యువత కోపం ప్రభుత్వానికి తెలిసేలా జయసారధి రెడ్డి పట్టం కడుతామని అంటున్నారు.