రెనో కైగర్ నుండి కొత్త ఉత్ప‌త్తులు

రెనో ఇండియా దేశమంతటా ఉన్న డీలర్షిప్స్ వద్ద కస్టమర్ల కొరకు నూతన గేమ్ చేంజర్ రెనో కైగర్ అమ్మకాలు మరియు డెలివరీల యొక్క ప్రారంభాన్ని ప్రకటించింది. సబ్-ఫోర్ మీటర్ ఎస్.యు.వి సెగ్మంట్ లో రెనో స్థానాన్ని దృఢపరిచే లక్ష్యంతో ముందుకు వచ్చిన ఈ స్మార్ట్, స్పోర్టీ మరియు స్టన్నింగ్ కారు, ఇండియన్ ఆటోమోటివ్ పరిశ్రమలో సరికొత్త ప్రమాణాలు స్థాపించుటకు అతి వేగంగా దూసుకుపోతున్నది. నేడు అమ్మకాలు ప్రారంభమైన మొదటి రోజున ఇండియా అంతటా 1100 కంటె ఎక్కువ కస్టమర్లకు Renault KIGER కార్లు డెలివర్ చేయబడ్డాయి.
ఈ డెలివరీల ప్రారంభోత్సవంలో, వెంకట్రామ్ మామిళ్లపల్లి, కంట్రీ సి.ఇ.ఒ & మేనేజింగ్ డైరెక్టర్, రెనో ఇండియా ఆపరేషన్స్ ఇలా అన్నారు, “ రెనో ఇప్పుడు, కైగర్ ద్వారా, ఇండియన్ ఆటోమోటివ్ పరిశ్రమ మీద ప్రధాన లక్ష్యం పెట్టుకున్న మరొక అత్యుత్తమ ఉత్పాదనను విజయవంతంగా ప్రారంభించింది. కైగర్ మీద అత్యధిక ప్రోత్సాహక స్పందనను చూపించిన మా వినియోగదారులకు మరియు మాకు అత్యధిక సహకారం అందించిన మా డీలర్ భాగస్వాములకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. కేవలం ఇండియాలోనే కాక, ప్రపంచమంతటా అత్యధిక సంఖ్యలో వినియోగదారులకు ఎస్.యు.వి లు అందుబాటులోకి తీసుకు వచ్చిన ఢస్టర్ తర్వాత, రెనో కైగర్ ఇప్పుడు అత్యధిక నూతన కస్టమర్లకు ఎస్.యు.వి ఆకాంక్షలు తీరేలా చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ నూతన గేమ్ చేంజర్ తో మేము రెనో పరివారంలోనికి అత్యధిక కస్టమర్లను ఆహ్వానించుటకు ఎదురు చూస్తున్నాము”.

ఇండియాలో రెనో ద్వారా లాంచ్ చేయబడిన విప్లవాత్మకమైన ఉత్పాదనలలో రెనో కైగర్ అత్యాధునికమైనది. అంతర్జాతీయ విడుదలకు ముందుగా, ఇండియా కొరకు డిజైన్ చేసి, డెవలప్ చేయబడిన ఒక సరికత్త – కాంపాక్ట్ ఎస్.యు.వి అయిన రెనో కైగర్ ఒక స్టన్నింగ్, స్మార్ట్ మరియు స్పోర్టీ B-SUV గా రూపు దిద్దుకుంది. దీని స్టన్నింగ్ డిజైన్ లో స్పోర్టీ మరియు మస్కులార్ ఎలిమెంట్లు ఉదాహరణగా చూపించబడినవి మరియు వీటి ద్వారా రెనో కైగర్ ఒక నిజమైన ఎస్.యు.వి గా ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీని లోపల, రెనో కైగర్ యొక్క స్మార్ట్ క్యాబిన్ లో టెక్నాలజీ, ఫంక్షనాలిటీ మరియు రూమీనెస్ విశిష్టతల సమ్మేళనం చోటు చేసుకుంది. మరింత పనితనం మరియు డ్రైవింగ్ ప్లజర్ కొరకు రెనో కైగర్ నూతన టర్బో చార్జెడ్ 1.0L పెట్రోల్ ఇంజన్ తో శక్తివంతంగా రూపొందించబడినది. ఈ అత్యున్నత పనితనం కలిగిన, అత్యాధునిక మరియు శక్తివంతమైన ఇంజన్ ద్వారా స్పోర్టీ డ్రైవ్ సునిశ్చిత పర్చబడుతుంది మరియు దీనితో పాటు కస్టమర్ల ప్రాధాన్యతలకు అనువుగా చక్కగా సరిపోయే విధంగా వినూత్న మల్టీ సెన్స్ డ్రైవ్ మోడ్స్ ఒక కాంప్లిమెంటుగా దీనితో లభిస్తున్నవి.
ఈ అత్యాధునిక రెనో కైగర్ ప్రస్తుతం దేశమంతటా వ్యాపించిన 500 కు పైగా ఔట్ లెట్ల లోని రెనో యొక్క విస్తృత డీలర్షిప్ నెట్ వర్క్ లో మరియు దీని వెబ్ సైట్ – https://www.renault.co.in/ లో బుకింగ్ కు లభిస్తున్నది. రెనో కైగర్ రెండు ఇంజన్ ఎంపికలతో, ఒక్కొక్క దానిలో 2 పెడల్ ఆఫరింగ్స్ తో 1.0L Energy మరియు 1.0L Turbo ఆప్షన్లలో లభిస్తున్నది. కస్టమర్లకు దీనిలో లభించే ట్రిమ్స్ – RXE, RXL, RXT & RXZ లో మరియు ఆరు ఆకర్షణీయమైన రంగులు – Caspian Blue, Radiant Red, Moonlight Silver, Planet Grey, Ice Cool White, Mahogany Brown లో ఈ శ్రేణిలో Dual Tone ఆప్షన్స్ తో రెనో కైగర్ లభిస్తున్నది.
యాక్సెసరీు మరియు పెర్సనలైజేషన్ విషయంలో, కస్టమర్లు 47 వేరు వేరు కేటగిరీలలో వర్గీకృతమైన అతిపెద్ద యాక్సెసరీల శ్రేణి నుండి తమకు కావలసినవి ఎంచుకొనవచ్చు. ఈ విస్తృతమైన యాక్సెసరీల శ్రేణి లో అయిదు ప్రత్యేకంగా క్యూరేట్ చేయబడిన యాక్సెసరీ ప్యాక్స్ ఉన్నవి – SUV, Attractive, Essential, Smart, Smart Plus. వీటిలో వైర్లెస్ ఛార్జర్ మరియు ఎయిర్ ప్యూరిఫైయ్యర్ వంటి టెక్ యాక్సెసరీలు సహా చేర్చబడినవి.