కాంగ్రెస్‌తో ఎప్పుడూ, ఎక్కడా పొత్తుండద ు: తేల్చి చెప్పిన మాయావతి

ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌తో తాము పొత్తుపెట్టుకోబోమని బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి స్పష్టం చేశారు. అంతే కాకుండా మరోసారి కాంగ్రెస్‌తో ఎన్నికలకు వెళ్లబోమని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం పార్టీ కార్యకర్తలతో మీడియాతో మాట్లాడిన మాయావతి.. ఈ మేరకు ప్రకటన చేశారు.

సమాజ్‌వాదీ పార్టీతో బీఎస్‌పీ పొత్తు నిజాయితీగల ఉద్దేశాలు, పరస్పర గౌరవాల ప్రాతిపదికన ఏర్పడిందని మాయావతి తెలిపారు. ఇది ఉత్తరాఖండ్, మద్యప్రదేశ్‌లలో కూడా కొనసాగుతుందని ఆమె చెప్పారు. ఇది సామాజిక మార్పుకు దోహదపడే మొట్టమొదటి ఖచ్చితమైన కూటమి అని అన్నారు. అంతే కాకుండా బీజేపీని ఓడించగల కూటమి అని చెప్పుకొచ్చారు.

ఎన్నో పార్టీలు బీఎస్‌పీతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాయని, అయితే వాటిల్లో ఎన్నికల లాభాలే ఉన్నాయి కానీ, పార్టీ పరమైన ప్రయోజనాలు ఏమీ లేవని మాయావతి అన్నారు