దొర పాల‌న చ‌ర‌మ గీతం మ‌హిళ‌ల చేతిలోనే : గాడిప‌ల్లి అరుణ‌రెడ్డి

తెలంగాణ‌లో దొర పాల‌న అంతం మ‌హిళ‌ల చేతిలోనే ఉంద‌న్నారు సిద్ధిపేట జిల్లా భార‌తీయ జ‌న‌తాపార్టీ మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు గాడిప‌ల్లి అరుణ‌. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ర‌క్తం ఏరులై పారేలాగా… ఒక గుండా రాజ్యంగా పెంచి పోషిస్తున్నార‌ని మండిప‌డ్డారు. దొర అహం అన‌గాలంటే ఒక్క మ‌హిళ‌ల చేతిలో సాధ్యం అవుతుందని పున‌ర్ధుఘాటించారు. సిద్ధిపేటలో భార‌తీయ జ‌నతా పార్టీ హ‌వా కొన‌సాగుతుంద‌ని, క‌మ‌లం పువ్వు గాలిలో గులాబికి గూడు లేకుండా పోతుంద‌ని అన్నారు. పార్టీ త‌రుపున జిల్లాల్లో వివిధ విభాగాల‌కు మ‌హిళ స‌భ్య‌ల‌ను ఆమె నియ‌మించారు. ఈ మేర‌కు జిల్లా అధ్య‌క్షుడు దూది శ్రీ‌కాంత్ రెడ్డి వారికి నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారు. ఈ సంధ‌ర్భంగా అరుణ మాట్లాడుతూ రానున్న ఎన్నిక‌ల్లో సిద్ధిపేట‌లో క‌మ‌లం పువ్వు విజ‌యం సాధిస్తుంద‌ని అన్నారు. ఇందుకు ప్ర‌తి మ‌హిల త‌మ ఛాయ‌శ‌క్తుల పాటు ప‌డుతార‌ని పేర్కొన్నారు. పార్టీలో ప‌దువులు ఇంకా బాధ్య‌త‌లను పెంచుతాయ‌ని అందుకు త‌గిన‌ట్టుగా క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన‌ప్పుడే త‌గిన గుర్తింపు ల‌భిస్తుంద‌ని అన్నారు.