రాముడి గుడికి డ‌బ్బులు ఇవ్వ‌ద్దు అన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

జ‌గిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల విద్యాసాగ‌ర్‌రావు వివాదస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే రాజ‌కీయంగా దెబ్బ మీద దెబ్బ ప‌డుతున్న టీఆర్ఎస్‌కి ఈయ‌న చేసిన వ్యాఖ్య‌లు పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు అయింది. దేశమంతా అయోధ్య‌లో రాముడు గుడి నిర్మించాల‌ని కోరుతూ నిధులు సేక‌రిస్తున్నారు. అయితే ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఉన్న రాముడి గుడికి నిధులు ఇవ్వ‌కూడ‌దు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌న ద‌గ్గ‌ర రాముడు లేడా గుడులు లేవా అంటూ అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. దీంతో నివ్వ‌ర పోయిన ప్ర‌జ‌లు ఎమ్మెల్యేపై  అస‌హానం వ్య‌క్తం చేశారు. గ‌తంలో క‌రీంన‌గ‌ర్ స‌భ‌లో సీఎం కేసీఆర్ హిందువులు బొందువుగాలు అని అన్న మాట‌ల‌కు అక్క‌డ  ఆ పార్టీ ఎంపీ అభ్య‌ర్థిని ఓడ‌గొట్టారు. ఇప్పుడు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న నాగార్జున సాగ‌ర్ ఎన్నిక‌ల ముందు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం తెరాసలో విస్మ‌యానికి గురిచేస్తున్నాయి. రాముడిపై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌బ‌బు కాద‌ని సొంత పార్టీ నేతలే బ‌హిరంగంగా విమ‌ర్శిస్తున్నారు.