సీఎం కేటీఆర్ అంటూ ఫిక్స్ చేసిన ప‌జ్జ‌న్న‌

తెలంగాణ రాష్ట్రంలో సీఎం మార్పుపై వ‌స్తున్న ఊహాగాహానాల‌కు ఒక్కొక్కురు లైన్ క్లియ‌ర్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈటెల నుంచి మొద‌లుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒక్కొక్క‌రుగా కాబోయో సీఎం కేటీఆర్ అంటూ చెప్ప‌క‌నే చెప్పేస్తున్నారు. అయితే ఇందులో ఎంత వాస్త‌వం ఉందో లేదో తెలియ‌దు కానీ తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ స‌మ‌క్షంలోనే మాజీ మంత్రి, ప్ర‌స్తుత శాస‌న‌స‌భ ఉప‌స‌భాప‌తి ప‌ద్మారావు గౌడ్ కాబోయో సీఎం అంటూ సంభోధించారు. అక్క‌డే ఉన్న కేటీఆర్ కూడా చూస్తూ… ఆ మాట‌ల‌ను ఎంజాయ్ చేశారు. ఇటీవ‌ల కాలంలో వ‌రుస‌పెట్టి మంత్రులు కేటీఆర్‌ని అంద‌ల‌మెక్కిస్తున్నారు. అయితే కేటీఆర్ సీఎం అయ్యాక‌… ఎవ‌రిని మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటారో వేచి చూడాలి మ‌రి.