తల్లులు కావడానికి కరోనా కలిసోచ్చింది ఆ హీరోయిన్లకు
కరోనా ఎంతో మంది ఇబ్బంది పెట్టినా…. ధనికులకు మాత్రం కాస్తా రిలాక్స్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిత్యం, ఆటలు, పాటలు, సినిమా షూటింగ్‌లు అంటూ కుటుంబానికి దూరంగా ఉంటూ.. ఎంతో మిస్ అయ్యేవారు. అయితే కరోనా వల్ల ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావడంతో కొంతమంది సెలబెట్రీలు సంతానంపై దృష్టి పెట్టారు అనిపిస్తోంది. 2020లో వర్క్ చేస్తే…. 2021 రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే టీం ఇండియా కెప్టెన్ విరాట్-అనూష్క ఫ్యామిలీకి మాత్రం తమ ఫస్ట్ చైల్డ్‌కి జనవరి 11న పేరెంట్స్‌గా ప్రమోట్ అయ్యారు.
2021లో బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ రెండోసారి పేరెంట్స్ అవుతున్నారు. బాలీవుడ్ ముద్దుగా పిలుచుకునే బెబో.. రోండో సారి తల్లవుతున్నానంటూ ఆగస్ట్‌లో అనౌన్స్ చేసింది. ప్రెగ్నెన్సీ అనౌన్స్ మెంట్‌తో టాక్ ఆఫ్ ద టౌన్ అయిన కరీనా కపూర్ అప్పటినుంచి సోషల్ మీడియాలో ఫోటోలతో, వీడియోలతో హడావిడి చేస్తోంది.
నువ్వునేను సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఇటు తెలుగు, అటు బాలీవుడ్‌లో బిజీ అయిపోయిన అనితా హస్సానందని, రోహిత్ రెడ్డి 2020 అక్టోబర్‌లో తమ కమింగ్ బేబీ గురించి అనౌన్స్ చేశారు. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో డెలివరీతో తల్లితండ్రులు కాబోతున్నారు.
ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నటి సాగరికా ఘట్కే జంట కూడా ఈ సంవత్సరమే పేరెంట్స్‌గా ప్రమోట్ కాబోతున్నారు. బాలీవుడ్ అప్ కమింగ్ యాక్టర్ నకుల్ మెహతా భార్య కూడా ఈ ఫిబ్రవరిలోనే బిడ్డ డెలివరీ కోసం వెయిట్ చేస్తోంది. ఇక 10 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న అదితి షిర్వైకర్, మోహిత్ మాలిక్ జంట కూడా రీసెంట్‌గానే తమ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు. రాబోయే సమ్మర్‌లో మా బిడ్డను చూస్కోబోతున్నాం అంటున్నారు. ఇలా స్టార్ కపుల్స్ ఎప్పుడెప్పుడు పుట్టబోయే పిల్లల్ని చూస్కుందామా అంటూ తెగ ఎక్సైటెడ్‌గా వెయిట్ చేస్తున్నారు.