సిగ్గులేని మంత్రులు : కాట్ర‌గ‌డ్డ

చ‌ట్ట‌బ‌ద్ద‌మైన ప‌ద‌వుల్లో ఉండి సృహా లేకుండా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు మాజీ ఎమ్మెల్యే , తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్య‌క్షురాలు కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌. ఏపీ అభివృద్ధి కోసం క‌ష్ట‌ప‌డ్డ చంద్ర‌బాబు క‌ష్టాన్ని నీళ్ల పాలు చేస్తూ.. ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడ‌కుంటున్నార‌ని ద్వ‌జ‌మెత్తారు. ఏ అవ‌స‌రం ఉంద‌ని ఏపీకి మూడు రాజ‌ధానులు కావాల్సి వ‌చ్చిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఏడాదిగా అమ‌రావ‌తి కోసం పోరాటం చేస్తున్న మ‌హిళ‌ల‌ను కూడా చూడ‌కుండా వైకాపా స‌ర్కార్ ఇబ్బంది పెడుతోంద‌ని విమ‌ర్శించారు. వందేళ్ల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఏపీని ఓ సింగ‌పూర్‌లా తయారు చేయాల‌ని, ప్ర‌జ‌ల‌కు ఏనాడు ఇబ్బంది లేకుండా చూడాల‌‌నుకున్నారు చంద్ర‌బాబునాయుడు అని పేర్కొన్నారు. అంతేకానీ రాష్ట్రంలో ప‌రిపాల‌నా ఏ విధంగా చేస్తారో తెలియ‌ని మంత్రులు ఈనాడు మంత్రివ‌ర్గంలో ఉండ‌డం సిగ్గుచేట‌న్నారు. మంత్రుల స్థాయి దిగ‌జారి మాట్లాడ‌డం సరైన ప‌ద్ద‌తి కాద‌న్నారు. అమ‌రావ‌తిని కాపాడుకోవ‌డానికి ఎంత‌టి త్యాగానికైన తామందరం సిద్దంగా ఉన్నామ‌ని తెలిపారు.