పీసీసీ రేవంత్ రెడ్డికే ఇవ్వాలి

పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి రేంవ‌త్‌రెడ్డికే ఇవ్వాల‌ని ప‌ట్టుబుడుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. గ‌త కొన్ని రోజులుగా పార్టీ త‌న భుజ‌స్కాంధాల మీద న‌డిపిస్తున్న ఆయ‌న ఆ ప‌ద‌వికి అర్హుడేన‌ని అంటున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇక్క‌డ పాలించే స‌త్తా ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ అని పేర్కొంటున్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో… ముందు ఉండి పోరాటం చేసిన వ్య‌క్తి అని మెద‌క్ జిల్లా కాంగ్రెస్ నేత‌లు కొనియాడారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ మ‌ళ్లీ పుంజుకోవాలంటే రేవంత్ అధ్య‌క్ష‌త‌నే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. పార్టీలో అన్ని శ్రేణుల‌ను క‌లుపుకొని పోయే స‌మ‌ర్థ నాయ‌కుడ‌న్నారు.