రెండో పెళ్లి చేసుకుంటున్న సింగర్ సునీత
ఎట్టకేలకు ప్రముఖ గాయని సునీత వివాహం ఓ కొలిక్కి వచ్చింది. 19 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కన్న సునీత కొన్ని కారణాల వల్ల మొదటి భర్త తో విడాకులు తీసుకుంది. అయితే అప్పటి నుంచి ఆమె రెండో పెళ్లి విషయంపై సినిమా రంగంలో చాలా పుకార్లు వచ్చాయి. అయితే పుకార్లకు చెక్ పెడుతూ సునీత నిశ్చితార్థం జరిగింది. సోషల్ మీడియా రంగంలో ఉన్న ప్రముఖ వ్యాపార వేత్తా … రామ్ వీరపనేనితో అతికొద్ది మంది సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వివాహ తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు సునీత తెలిపారు.