సాయం చేసి ఆదుకోండి
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన ఏలేటి నర్సారెడ్డి 35కు కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి చూపించుకున్నారు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రెండు కిడ్నీలు పనిచేయడం లేదని చెప్పడంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు నర్సారెడ్డి వెంటనే సర్జరీ చేయాలని ఎవరైనా కిడ్నీ దాతలు ఉంటే చూడాలని వైద్యులు చెప్పడంతో ఎవరిని సంప్రదించాలో తెలియక ఆ కుటుంబం దీన స్థితిలో ఉంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కు రూపాయలు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో వారి కుటుంబం అయోమయంలో పడింది ఇప్పటికే లక్ష రూపాయలు అప్పు చేసి నరసారెడ్డికి చికిత్స చేయించారు మరిన్ని డబ్బులు కావాలనడంతో దిక్కుతోచని పరిస్థితిలో నరసారెడ్డి కుటుంబం ఉంది నరసరెడ్డి స్వప్న లకు ఇద్దరు కుమార్తెలు నక్షత్ర అన్విక ఉన్నారు నర్సారెడ్డి పనిచేస్తే కానీ ఆ కుటుంబం గడవని స్థితిలో ఉండటంతో ఆయనను బతికించుకునే0దుకు ఆయన భార్య స్వప్న నానా తిప్పలు పడుతుంది కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుంది ఎవరైనా దాతలు ఉంటే తమకు తోచిన సహాయం చేసి తమ కుటుంబ పెద్ద దిక్కును కాపాడాలని వేడుకుంటున్నారు ఎవరైనా ఆర్థిక సహాయం చేసేవారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇచ్చోడ బ్రాంచ్ ఏలేటి స్వప్న అకౌంట్ నెంబర్ 79031390644 కు పంపాలని వేడుకుంటున్నారు