తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవిద్కి తిరుమలలో ఘన స్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయంకి చేరుకున్నారు. అప్పటికే అక్కడి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్మోహన్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, పార్టీ నాయకులు మేకపాటి గౌతమ్ రెడ్డి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. దర్శనం తరువాత అక్కడి అధికారులతో మాట్లాడనున్నారు. రాష్ట్రపతి రాకతో తిరుమలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.