అస‌దుద్దీన్ అడ్డుకున్న ముస్లిం మ‌హిళ‌లు

హైద‌రాబాద్ హామారా అంటున్న ఎంఐఎం నేత‌ల‌కు కూడా తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. పార్టీకి గ‌ట్టి ప్రాంత‌మైన జాంబాగ్‌లోని స్థానికులు ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని పలువురు మహిళలు ఆయనను నిలదీశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జాంబాగ్ డివిజన్‌లో ఎంఐఎం అభ్యర్థి రవీందర్ కు మద్దతుగా ఒవైసీ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తూ ముందు సాగుతున్నారు. ఒకచోట మాత్రం ముస్లిం మహిళలు ఒవైసీపై మొహం మీదనే ఏకిపారేశారు. తాము కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారని ప్రశ్నించారు. తాము కష్టాలుపడుతుంటే పట్టించుకోలేదు.. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతారని స్థానిక మహిళలు నిలదీశారు. మహిళల మాటలు విన్న ఆయన వారికి సమాధానం ఇవ్వకుండానే వెనుదిరిగారు.