జోలె ప‌ట్టిన టీడీపీ ఉపాధ్య‌క్షురాలు కాట్ర‌గ‌డ్డ‌

హైద‌రాబాద్ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో విన్నూత ప్ర‌చారం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఈ ఎన్నిక‌ల్లో సామాన్య ప్రజ‌ల‌ను పోటీలో ఉంచామ‌ని  ఆ పార్టీ ఉపాధ్య‌క్షురాలు కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌. స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌వ‌ర్గంలోని 149 వ డివిజ‌న్ బేగంపేట నుండి ఓ ఆటో డ్రైవ‌ర్ భార్య ఫ‌రీనాను పోటీలో ఉంచామ‌ని తెలిపారు. డ‌బ్బుల‌కు అమ్ముడుబోతున్న ఈ కాలంలో ఓట‌ర్ల నుంచే డ‌బ్బులు బిచ్చ‌మెత్తి ప్ర‌చార ఖ‌ర్చుల‌ను పోగు చేస్తున్నామ‌న్నారు. ఎన్టీఆర్ గ‌తంలో ఎలాంటి రాజ‌కీయ మార్ప‌ల‌ను తీసువ‌చ్చారో అలాంటి మార్పే ఇప్పుడు మ‌ళ్లీ వ‌స్తుంద‌ని జోస్యం చెప్పారు. మైనార్టీల‌కు, బీసీల‌కు ఇలా కులంతో సంబంధం లేకుండా సేవ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని అన్నారు. బేగంపేట చనిపోతే ద‌హాన సంస్కారాల‌కు క‌నీసం స్మ‌శానం కూడా ఏర్పాటు చేయ‌లేని తెరాస‌కు ఓట్లు అడిగే హ‌క్కులేద‌న్నారు. ఓ ఆటో డ్రైవ‌ర్ భార్య‌ను దీవించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాల‌ని ఆమె కోరారు.