సనత్ నగర్ నియోజకవర్గంలో సత్తా చాటేది తెలుగుదేశమే : కాట్రగడ్డ
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో సనత్నగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో తెలుగుదేశం పార్టీ తప్పక విజయం సాదిస్తుందని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన. అన్ని డివిజన్లలో తమ ఓటు బ్యాంకు అలాగే ఉందని ఏ పార్టీ కూడా తమ దరిదాపుల్లోకి రాలేదని జ్యోసం చెప్పారు.
నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని డివిజన్లలో తమ పార్టీ రేపటి నుండి ప్రచారం చేయనున్నారని తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి అట్టడుగులో ఉన్నవారిలో రాజకీయ ప్రతిభ వెలికి తీసిన ఎన్టీఆర్ మాదిరిగానే ఇప్పుడు తమ పార్టీ అభ్యర్థులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఆనాడు చంద్రబాబు చేసిన పుణ్యమేనని అన్నారు. మళ్లీ హైదరబాద్కి గత వైభవం రావాలంటే ఖచ్చితంగా గ్రేటర్ లో పచ్చజెండ ఎగరాల్సిందేనని అన్నారు. తెరాస అధికారంలోకి వచ్చి ఏళ్లు గడిచిన చేసిన అభివృద్ధి శూన్యమని వివరించారు. తెరాస పార్టీలో జెండ మోసిన నాయకులకు కాకుండా డబ్బులున్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, మేయర్ పదవికి బొంతు రామ్మెహన్ భార్య, మరోవైపు మంత్రుల కోడళ్లు, కూతుర్లు పోటీ పడుతున్నారని ఆరోపించారు. అలాంటి వంశ పారపర్యం కాకుండా నిజాయితీగల తెలుగుదేశం అభ్యర్థలను గెలిపించి నగర అభివృద్ధి చేయాలని ఆమె కోరారు.