ఎక్కడిక్కడ భాజనా నాయకుల అరెస్టులు
డెక్కన్ న్యూస్, మెదక్ ప్రతినిధి, శ్రీకాంత్ చారి:
రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నాయకులను అరెస్ట్లు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. రైతులకు గిట్టుబాట ఇవ్వాలని ప్రగతి భవన్ ముట్టడికి భాజపా రాష్ట్రశాఖ పిలుపునిచ్చింది. ఈ మేరకు అందరూ నాయకులు జిల్లాల నుండి నగరానికి చేరుకోవడానికి ముందే వారిని అరెస్ట్లు చేశారు. చేగుంట మండలంలోని మెదక్ జిల్లా కార్యదర్శి దొంతి రెడ్డి ఎల్లారెడ్డి ని రాష్ట్ర బిజెపి దళిత నాయకులు కొండి స్వామి, మండల అధ్యక్షులు చింతల భూపాల్, చేగుంట పట్టణ అధ్యక్షులు సాయిరాజ్లను అరెస్ట్ చేసి చేగుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు.