మంత్రి హారీష్రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన తెజస నేత రాజశేఖర్రెడ్డి
– హరీష్ ఓ చెల్లని రూపాయి
డెక్కన్ న్యూస్
మంత్రి హారీష్రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జన సమితి మెదక్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి. దుబ్బాక ఎన్నికల ఫలితం తెరాసకు చెంపపెట్టులాంటిదన్నారు. ఉప ఎన్నికల మంత్రి, ఆరడుగుల బుల్లెట్ ఏమి పని చేయలేవని, ఇప్పుడొక చెల్లని రూపాయిగా మారరని విమర్శించారు. పక్క నియోజకవర్గానికి ఏం చేశారని ఓట్లు అడిగారని ప్రశ్నించారు. దుబ్బాకలోని పాత బస్టాండ్ ఎలా ఉందో కూడా తెలయని ఆయన ఇప్పుడు సవాలు విసిరారని గుర్తు చేశారు. అభివృద్ధిని చూసి ఓటర్లు ఓటు వేశారన్నారు. అంతేకానీ సింపతి కోసం రాంలింగారెడ్డి భార్య రోడ్ల మీద తిప్పి ఏడిపించి ఓట్లు రాబట్టాలన్న వారి ప్రయత్నాలు చెల్లలేవని, మార్పు కోసం ప్రజలు రాఘునదంన్రావుకి ఓటు వేశారన్నారు. సిద్దిపేటలో పార్టీ కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలన్న అంతర్మదనంలో పడ్డారని పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయ మార్పుల ఫలితాలే రాబోయో రోజుల్లో అన్ని ఎన్నికల్లో పునరావృతం అవుతాయన్నారు.