ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారు : జ‌య‌సార‌ధి

తెలంగాణ‌లో ప్ర‌జ‌లు రాజ‌కీయ మార్పు కోరుకుంటున్నార‌ని అన్నారు వామ‌ప‌క్ష‌ల పార్టీల ఎమ్మెల్సీ అభ్య‌ర్ధి జ‌య‌సార‌ధి రెడ్డి. ఇలాంటి ఫ‌లిత‌మే వ‌ర‌గంల్‌, ఖ‌మ్మం, న‌ల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. అక్క‌డ భాజ‌పా జెండ ఎగిరితే ఇక్క‌డ ఎర్ర జెండ ఎగ‌ర‌డం ఖాయ‌మ‌న్నారు. ఇప్ప‌టికే యువ‌తో పెను మార్పు చోటు చేసుకుంద‌ని, ఇక ఎన్నిక‌లు రావ‌డ‌మే ఆల‌స్య‌మ‌న్నారు. రాష్ట్రంలో ఎటువంటి పాల‌న సాగుతుందో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంద‌న్నారు. అందుకే మార్ప కోసం వేచి చూస్తున్నార‌ని అన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంతో పోలిస్తే ఒకే పార్టీ రెండు సార్లు మాత్ర‌మే అధికారంలోకి వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. ఇక ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల్లో యువ‌త తెరాసకు పూర్తి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నార‌ని తెలిపారు.