వంద మంది వీఐపీ భార్య‌ల‌తో అక్ర‌మ సంబంధం చివ‌రికి

డెక్క‌న్ న్యూస్‌, నేష‌న‌ల్ బ్యూరో :
అంద‌మైన వీఐపీ భార్య‌, బిడ్డ‌ల‌కు వ‌ల వేశాడు. ప‌డ్డ చేప‌లన్నింటిని వాడేసుకున్నాడు. 26ఏళ్ల యువకుడు. వందమంది అమ్మాయిలు, వీఐపీల భార్యలు, వారి కూతుళ్ల జీవితాలతో చెలగాటమాడాడు. చివరికి అతడి బండారం బయటపడడంతో జైలు పాలయ్యాడు. జైలు పాలైన కొడుకును బయటకు తెచ్చేందుకు అతని తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. కానీ కామాంధుడు కాశి తరుపు వాదించేందుకు తాము సిద్ధంగా లేమంటూ లాయర్లు చెప్పడంతో ఈ కేసు మరింత చర్చాంశనీయంగా మారింది. తమిళనాడు నాగర్ కోవిల్ కు చెందిన కాశి. కామపిశాచీ. డబ్బు సంపాదించాలన్న అత్యాశ. ఈ మాస్టర్ మైండ్ తోడు అతని స్నేహితులు. తమిళనాడులో వీఐపీ భార్యలు, వారి కూతుళ్ల అక్రమ సంబంధాలు, యువతుల అవసరాన్ని క్యాష్ చేసుకున్న నిందితుడు సుమారు 100మందికి పైగా మోసం చేశాడు. వీఐపీల భార్యల అక్రమ సంబంధాల్ని రహస్యంగా వీడియోలు తీయడం, ఆ వీడియోలు చూపించి దందాలు చేయడం. యువతులకు డబ్బు ఆశచూపి వారిని లోబరుచుకోవడం కాశిపని. అయితే ఓ డాక్టర్ వల్ల కాశీ పాపం పండి జైలు పాలయ్యాడు. నమ్మించి మోసం చేసి అశ్లీల వీడియోలు తీసి కాశి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఓ లేడీ డాక్టర్ గత ఏడాది మేలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాశీకి సంబంధించిన కుటుంబసభ్యుల ఇళ్లు, స్నేహితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ సంఖ్యలో వీడియోలు, కెమోరాలతో పాటు పలు పెన్ డ్రైవ్ లను స్వాధీనం చేసుకున్నారు. కాశీ అరెస్టైన తరువాత ఇన్ని నెలలు సైలెంట్ గా ఉన్న బాధితులు ఒక్కక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. తాజాగా ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం జైల్లో ఉన్న కాశీని విచారణ చెయ్యాలని సీబీసీఐడి అధికారులు నిర్ణయించారు. సీబీసీఐడీ అధికారుల విచారణలో కాశీ బాధితులు ఇంకెంత మంది ఉన్నారో తెలియాల్సి ఉంది.