న్యాయం కోసం ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

డెక్క‌న్ న్యూస్‌, ఆదిలాబాద్ ప్రతినిధి, స‌య్య‌ద్ ఖ‌మ‌ర్ :
ఇచ్చోడ అగ్గి రాజై మండుతోంది. ఓ యువ‌కుడి హ‌త్య ఆ ప్రాంతాన్ని క‌లిచివేసింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి చెందిన బగ్నురే జ్ఞానేశ్వర్ హత్య చేయబడిన విషయం విదితమే. నిందితుడు జాదవ్ శ్రీనివాస్ తో పాటు ఈ హత్యలో పాల్గొన్న మిగతా వారిని కూడాకూడా శిక్షించాలని గ్రామస్తులు, నిందితుని కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఇచ్చోడ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.నిందితుడు శ్రీనివాస్ ఈ హత్య ఒక్కడే చేసి ఉండడని స్థానికులు పేర్కొన్నారు.ఈ హత్యలో మిగిలిన నిందితుల పేర్లు చెప్పకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మిగతా నిందితులను పేర్లు తప్పించడం కోసం కుట్ర జరుగుతోందని మరఠా సంఘం నాయకులు,గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వాహనాన్ని అడ్డుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.వెంటనే ఎమ్మెల్యే స్పందించి ఎమ్మెల్యే ఎస్పీతో మాట్లాడి నిందితులు ఎంతటివారైనా వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.నిందితులందరికీ శిక్ష పడిని యెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామస్తులు,మృతుని కుటుంబ సభ్యులు హెచ్చరించారు.మృతుడు బగ్నురే జ్ఞానేశ్వర్ అందరితో కలిసిమెలిసి స్నేహపూర్వకంగా ఉండడంతో ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.